నీళ్ళు లేని నుయ్య
అనగనగా వీరభద్ర అనే ఒక మహర్షి తపస్సు చేయడానికని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉండే ఒక చిన్న అడవికి వెళ్ళారు.
అలా తపస్సు చేస్తున్న మహర్షిని గమనించిన ఒక కోతి, " ఎవరో వింత మనిషి మన అడవిలోకి వచ్చి ఏవేవో మంత్రాలు జపిస్తున్నాడు. పైగా అతను కూడా మన మృగరాజులా పెద్ద గెడ్డం పెట్టుకొని ఉన్నాడు" అని అడవంతా చాటింపు వేసింది. ఈ వార్త ఆనోటా ఈనోటా పడి మృగరాజు సింహం చెవిన పడింది. సింహం ఆ మహర్షిని చూడడానికని బయలుదేరింది. అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ సింహం వెంటవెళ్లాయి. .....