పేరాశ ప్రకాశం

పూర్వం సజ్జల అనే రాజ్యంలో సీతయ్య అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే రైతుల వద్ద పూలు, పళ్ళు, కూరగాయలు వంటివి తక్కువ ధరకి కొని సంతలో అమ్మేవాడు. సీతయ్య తనకు సాయంగా ఉండడానికి ప్రకాశం అనే ఒక యువకుడిని పనిలో పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ కలసి చాలా బాగా వ్యాపారం చేసేవారు.

కొన్నాళ్ళకి ప్రకాశానికి కూడా వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చి తన యజమానిని సహాయం కోరాడు. సీతయ్య ఎంతో ఉదార స్వభావం కలవాడు. తన దగ్గరే ఎంతో నమ్మకంగా చాలాకాలం పనిచేసిన ప్రకాశానికి తానే కాస్త డబ్బులు సహాయం చేసి వ్యాపారం పెట్టించాడు. ప్రకాశం కష్టపడి పనిచేసి వ్యాపారాన్ని నిలబెట్టుకున్నాడు. నెమ్మదిగా తనకి లాభాలు రావటం ప్రారంభమయ్యాయి. కానీ ప్రకాశానికి తృప్తిగా ఉండేదికాదు. వస్తున్న దానికన్నా ఇంకా ఎక్కవ లాభాలు సంపాదించేయాలన్న దురాశ మొదలయ్యింది.



Buy Now