ముందు చూపు
పూర్వం మొఘలుల రాజ్యంలో యూసఫ్, ఇర్ఫాన్ అనే ఇద్దరు చిన్న వర్తకులు ఉండేవారు. వారు ఊరూరూ తిరుగుతూ వివిధ రకాల పాల ఉత్పత్తులు, స్వీట్లు అమ్ముకుంటూ బతికేవారు.
యూసఫ్ కి ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనేది కల, అలాగే ఇర్ఫాన్ కి నగరంలో ఒక పెద్ద స్వీట్ల దుకాణం ప్రారంభించాలని కోరిక ఉండేది. దానికోసం వాళ్ళు కష్టపడి పనిచేస్తూ కొద్దికొద్దిగా డబ్బులు కూడబెట్టుకునేవారు. ...