మేలు
అనగనగా రత్నగిరి అనే గ్రామంలో మాణిక్యం అనే ఒక పాడి రైతు ఉండేవాడు. ఆయన వద్ద కొన్ని ఆవులు, గేదెలు, మేకలూ ఉండేవి. మాణిక్యం ప్రతిరోజూ పాలుపితికి పక్కనున్న పట్టణంలో అమ్మి డబ్బులు సంపాదించేవాడు. అలా సంపాదించిన డబ్బులు కొద్దికొద్దిగా పొదుపు చేసుకొని కొత్త ఆవులు, గేదెలు కొనుక్కుంటూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసేవాడు.
మాణిక్యానికి సుధాకర్ అనే ఒక 8 ఏళ్ల కొడుకు ఉండేవాడు. అతనకి మూగజీవాలంటే అమితమైన ప్రేమ. ఒకరోజు సుధాకర్ దెబ్బలతో ఉన్న ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. వెంటనే దాన్ని తనతోపాటు ఇంటికి తీసుకువచ్చి ప్రేమగా మందులురాసి కట్టుకట్టాడు.....