కలుపు మొక్కలు నేర్పిన పాఠం
అనగనగా అత్రేయపురం అనే ఒక గ్రామంలో రామయ్య అనే ఒక మోతుబరి రైతు ఉండేవాడు. రామయ్య తన తెలివిని, కష్టాని పణంగా పెట్టి ఎంతో చిన్నస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి బాగా డబ్బూ పరపతీ సంపాదించాడు.ఆయనకి నగేష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. ఒక్కగానొక్క సంతానం కావటంతో కొడుకుని ఎంతో గారాబంగా పెంచాడు.
నగేష్ తన తండ్రి సంపాదించిన ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ, జల్సాలు చేస్తూ , బలాదూర్ గా తిరిగేవాడు. కొడుకు చేష్టలతో విసుగెత్తిపోయిన రామయ్య, తన కొడుకుని ఎలాగైనా దారిలోకి తీసుకురావాలని, ఇకపై పనిచేస్తేనేగాని డబ్బులు ఇవ్వనని మందలించి, నగేష్ ని తన రైస్ మిల్లులోనే లెక్కలు చూసే గుమాస్తాగా పనిలో పెట్టుకున్నాడు. నగేష్ తన తండ్రి మాట విని నెమ్మదిగా పని నేర్చుకుంటూ ప్రతి నెలా జీతం అందుకునేవాడు. రామయ్య తన కొడుకు పనిచేస్తుండటం చూసి ఆనందంతో ......