బంగారు గాజులు
అనగనగా దశకర్ణి అనే రాజ్యంలో బాగా ప్రసిద్ధి చెందిన మహేంద్ర అనే కంసాలి ఉండేవాడు. బంగారు ఆభరణాలు తయారుచేయటంలో అతడిని తలదన్నేవారే లేరు. అతనికి ఉమేష్ అనే ఒక కొడుకు ఉండేవాడు. ఉమేష్ అప్పుడప్పుడూ తన తండ్రికి సహాయం చేస్తూ తన తండ్రి చేసే పనిని గమనించేవాడు.
ఒకసారి ఓ అత్యవసర పనిమీద మహేంద్రకు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. తనకి వెళ్ళాలని ఉన్నా, వ్యాపారాన్ని వదిలి వెళ్ళటం ఎలా అని ఆలోచించాడు. ఇక చేసేది ఏమీలేక తన కొడుకుకి కొట్టు బాధ్యతలు అప్పజెబుతూ, "నాయనా ఉమేష్! నేను ఒక ముఖ్యమైన పనిమీద కాశీ నగరానికి వెళ్తున్నాను, రావటానికి పది- పదిహేను రోజులు పడుతుంది.