దేవగాన్నేరు పూలు
అనగనగా పేరవరం అనే ఊర్లో ప్రసిద్ధి చెందిన ఒక శివాలయం ఉండేది. అక్కడ ప్రజలు దేవుణ్ణి దేవగన్నేరు పువ్వుతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని నమ్మేవారు. దానివల్ల అక్కడ ఆ పువ్వులకు మంచి గిరాకీ ఉండేది. ఆ గుడికి కాస్త దూరంలో కొన్ని దేవగన్నేరు పూలతోటలు ఉండేవి. అక్కడ రైతులు ఒక మొక్క నుంచి కొమ్మ నరికి ఆ కొమ్మని భూమిలో నాటి సాగుచేస్తూ ఉండేవారు.
అలా ఒక్కొక్క కొమ్మ నుంచి ఒక్కొక్క మొక్క వచ్చేది. అక్కడే గుడిలో పనిచేస్తున్న రమేష్ అనే యువకుడు ఇదంతా గమనించి, “అబ్బా! ఇదేదో చాలా బాగుందే... కేవలం పది మొక్కలు పది సెంట్లు భూమి ఉంటే మనం కూడా ఇలా తోట పెంచి డబ్బు సంపాదించవచ్చు” అని గట్టి నమ్మకంతో ఒక భూమి కౌలుకు తీసుకొని అందులో దేవగన్నేరు మొక్క కొమ్మలని నాటాడు. అలా చక్కగా రెండు వారాలు నీళ్లుపోసి వాటిని పెంచాడు. అయినప్పటికీ తను నాటిన కొమ్మలన్నీ జీవంలేకుండా వాడిపోయాయి. సరే ఎరువు సరిపోక ఎండిపోయాయేమోనని ఈసారి మళ్ళీ మొక్కలు ........