సర్కస్ సింహం
అనగనగా కొహిమా నగరంలో జంబో సర్కస్ ఉండేది. అందులో కేసరి అనే ఒక సింహం ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులని అలరిస్తూ ఉండేది. ఇక కేసరి వయస్సు అయిపోవటం గమనించిన తన యజమాని కేసరిని తన శేష జీవితాన్ని స్వేచ్ఛగా బతకమని ఒక అడవిలో వదిలిపెట్టాడు.
కేసరి తన యజమానికి ధన్యవాదాలు తెలిపి అడవిలో తన నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందోనని వెతకడం మొదలుపెట్టింది. అలా వెతుక్కుంటూ ఒక కొండపై ఉన్న ఒక గుహ వద్దకు చేరుకుంది. ఇక్కడైతే తన నివాసం బాగుంటుందని ఎండకు ఎండకుండా వర్షానికి తడవకుండా హాయిగా జీవించవచ్చు అనుకుని తన నివాసం ఏర్పాటు చేసుకుంది.......