చిట్టి పరిష్కారం

అనగనగా కొండపల్లి అనే గ్రామ శివారులలో ఒక పళ్ళ తోట ఉండేది. ఆ తోటలో చిన్నచిన్న పక్షులు, బుల్లి బుల్లి ఉడతలు జీవిస్తూ ఉండేవి. అసలు వన్యమృగాల తాకిడే లేని ఆ తోటలో అవి ఎలాంటి బాధ, భయం లేకుండా అక్కడ దొరికే వివిధ రకాల పండ్లు తింటూ హాయిగా జీవనం సాగించేవి.

అలా కొన్నాళ్ళకి, అటువైపుగా వెళుతున్న గోలు అనే ఒక అల్లరి కోతి ఆ తోటపై కన్నేసింది. అది అదును చూసి ఆ తోటలోకి ప్రవేశించి ఇష్టం వచ్చినట్టు చెట్లకున్న పండ్లని తెంపుతూ, వాటిని చిన్నాభిన్నం చేస్తూ ఆ తోటని నాశనం చేసేది. గోలు దురుసుతనంతో అక్కడ ఉన్న పక్షులు ఉడతలు బెదిరిపోయేవి. ఆ కోతి ఆగడాలని భరించలేక దానిని ఎలా ఎదురుకోవాలో చర్చించుకోవడానికి సమావేశమయ్యాయి.



Buy Now