చురుకైన చంద్రం
అనగనగా అగర్తల అనే రాజ్యంలో రంగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకి వీరయ్య, చంద్ర, సిద్ధ అనే ముగ్గురు కుమారులు. రంగయ్య తన ముగ్గురు కుమారులకు తన వ్యాపార వ్యహారాలను అప్పజెప్పి తీర్థయాత్రలు చేస్తూ తన శేష జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలని అనుకున్నాడు.
అయితే తన ముగ్గురు కుమారులకు వ్యాపారం అప్పజెప్పేముందు వారి సామర్థ్యాలను పరీక్షించాలని, తన కుమారులని పిలిచి వారికి తన నిర్ణయాన్ని వివరించాడు "కుమారులారా, మీ ముగ్గురి మీద నాకు అమితమైన ప్రేమ ఉంది. మీ ముగ్గురిలో నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ముగ్గురూ సమానమే. నేను మీకు నా వ్యాపారాలు అప్పజెప్పే ముందు .....