బతకలేని భద్రం
అనగనగా నందగిరి అనే ఒక అడవిలో భద్రం అనే ఒక నక్క ఉండేది. అది తన చిన్నతనం నుంచి ఆ అడవికి రాజైన సింహం వద్ద సహాయకుడిగా పనిచేస్తూ ఉండేది
సింహం వేటాడి అందులో కొంత ఆహారం నక్కకు తెచ్చి ఇచ్చేది. మన భద్రం వేటాడి అలిసిపోయి వచ్చిన సింహానికి ప్రతిరోజూ సేవలుచేస్తూ సింహం చెప్పే పనులు తూచాతప్పకుండా పాటిస్తూ గడిపేసేది. సింహం దగ్గర పనిచేయడంతో నక్క సింహంలేని సమయంలో మిగతా జంతువుల మీద పెత్తనం చలాయించేది. సింహానికి భయపడి ఎవరూ మన భద్రాన్ని ఏమీ అనేవారు కాదు. అలా నక్క జీవితం సాఫీగా ఎలాంటి చీకూ చింతా లేకుండా సాగిపోయేది..........