అతివృష్టి అనావృష్టి
అనగనగా తిమ్మాపురం అనే గ్రామంలో రామయ్య, చంద్రయ్య అనే ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. ఇద్దరూ సమానంగా సంపాదించేవారు. రామయ్య ఒట్టి పిసినారి. తనకి రూపాయి మిగులుతుంది అంటే పది మైళ్ళు నడిచి వెళ్లేవాడు. ఇక పండగలకూ పబ్బాలకైతే తన ఇంటికి చుట్టాలు వస్తారేమోనని ఇంటికి తాళంవేసి లోపలే కూర్చునేవాడు. కనీసం కొత్తబట్టలు కొనుక్కొని వేసుకునేవాడు కూడా కాదు.
చంద్రయ్య మాత్రం రామయ్యకి భిన్నంగా, తనకు అవసరం ఉన్నా లేకపోయినా రూపాయికి పది రూపాయలు ఖర్చుపెట్టి ఆడంబరంగా జీవించేవాడు. కొన్నాళ్ళకు ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చారు. చంద్రయ్య, రామయ్య దగ్గరకు వెళ్లి స్వామీజీని కలుద్దాం పద అని చెప్పాడు. రామయ్యకు స్వామీజీని కలవాలని ఉన్నా దక్షిణ ఇవ్వాల్సొస్తుందని వెళ్ళకూడదని అనుకున్నాడు. చంద్రయ్య ఆయన్ని కలిసి వ్యాపారం కోసం సలహా అడుగుదామని రామయ్యను బలవంతంగా తీసుకెళ్లాడు.