అరెరే ఐరా
అనగనగా గిర్ అనే అరణ్యంలో ఐరా అనే ఒక ఏనుగు ఉండేది. అది తన తోటి జంతువులతో ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేది. ఐరాది జాలిగుండె. అవసరమని ఎవరొచ్చినా వారికి కావలసిన సహాయం చేసేది.
ఒక రోజు ఐరా స్నానం చెయ్యడానికని జలపాతం వద్దకు వెళ్ళి పాట పాడుకుంటూ హాయిగా జలకాలాడుకుంటూ ఉంది. అప్పుడు తనకి ఎవరో ఏడ్చినట్లు వినిపించి అటూఇటూ చూసింది. ఎవరూ కనిపించకపోయేసరికి, ఏదో భ్రమ అనుకొని మళ్ళీ పాటపాడుకుంటూ స్నానం చేయసాగింది. ఈసారి మళ్ళీ ఏడుపు వినిపించడంతో, "అమ్మో ఇక్కడ ఏదో దెయ్యం ఉన్నట్లు ఉంది" అని భయంతో గజగజలాడుతూ శబ్దం ఎటు వైపు నుండి వస్తోందో గమనించి......