చీమ నేర్పిన చిట్టి పాఠం
అనగనగా నీలగిరి అనే అడవిలో మాల్యా అనే ఒక గంభీరమైన సింహం ఉండేది. అది ఒక్క పంజా దెబ్బతో ఎటువంటి జంతువునైనా పడగొట్టగల బలశాలి మాల్యాకి తనని మించిన శక్తిమంతులూ గొప్పవాళ్ళూ ఎవ్వరూ లేరనే గర్వం.
ఒకరోజు మాల్యా ఒక జింకని వేటాడి తింటూఉంది. ఆ పక్కనే పుట్టలో నివసిస్తున్న గోపి అనే ఒక చిన్న చీమ, సింహం తిని వదిలేసిన జింక కళేబరం నుంచి కొద్దికొద్దిగా మాంసాన్ని తన నివాసంలోకి చేరవేయటం మొదలుపెట్టింది. అలా మాంసాన్ని చేరవేసే క్రమంలో చీమ అనుకోకుండా సింహం తోకని పుటుక్కుమని కరిచింది. దానికి సింహం కోపంగా చీమపైకి పంజా ఎత్తిపెట్టింది.