అగ్ని పర్వతం
అనగనగా ధృవ అనే దేశానికి దక్షిణాన సుదీప అనే అగ్నిపర్వతం ఉండేది. ఆ అగ్నిపర్వతం చుట్టూ ఉండే ఒక చిన్న అడవిలో ఎన్నో జంతువులు హాయిగా జీవిస్తుండేవి.
ఆ అడవిలో భవిష్యవాణి తెలుసని చెప్పుకుని తిరిగే గోలు అనే ఒక చింపాంజీ ఉండేది. ఒకసారి తుపాను వస్తుందని చెప్పింది. నిజంగానే పెనుగాలులతో కూడిన భారీ తుపాను వచ్చింది. ఇంకోసారి ఆకాశం పడిపోతుంది అని చెప్పింది. కానీ అది జరగలేదు. ఇలా అది చెప్పేవాటిలో కొన్ని నిజం అయ్యేవి, కొన్ని కాకపోయేవి. అయినప్పటికీ అక్కడ జంతువులన్నీ గోలు ఏమి చెప్పినా జాగ్రత్తలు తీసుకునేవి. ఒకసారి గోలుకి ఆహారం మాయమైపోయినట్టు కలవచ్చింది. ఇది విన్న జంతువులన్నీ కొంత ఆహారాన్ని దాచుకున్నాయి.